ఆలిండియా కోటాలో బీహెచ్‌ఎంఎస్‌ ప్రవేశాలకు ప్రకటన జారీ

నీట్‌ 2021లో అర్హత సాధించిన విద్యార్థులకు ఆలిండియా కోటాలో బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలల్లోని ఆలిండియా కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు.

బుధవారం(ఈ నెల 16న) ఉదయం 8 గంటల నుంచి 20న సాయంత్రం 5 గంటల వరకూ ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తుతో పాటే కళాశాల వారీగా వెబ్‌ ఆప్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది.

నీట్‌ 2021లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ కోటా సీట్ల భర్తీకి అర్హులు. మరింత సమాచారం కోసం కాళోజీ ఆరోగ్య వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని వర్సిటీ వర్గాలు సూచించాయి.

● వెబ్సైట్ : http://www.knruhs.telangana.gov.in/