వేతనాలు లేక పార్ట్ టైమ్ వొకేషనల్ లెక్చరర్ ల ఆర్దిక వెతలు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న పార్ట్ టైమ్ వొకేషనల్ లెక్చరర్ లకు ఎప్రిల్ 2021 నుండి ఇప్పటి వరకు 9 నెలలుగా వేతనాలు చెల్లించలేదని వాపోతున్నారు.

జనవరి – 2022 లో ఈ పెండింగ్ వేతనాలకు సంబంధించిన బిల్స్ సమర్పించిన కూడా ఇంతవరకు వేతనాలు వ్యక్తిగత ఖాతాలలో జమ కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని లెక్చరర్ లు వాపోయారు.

జీతాలు లేక పిల్లల పీజులు కట్టలేక పోతున్నామని,కుటుంబ పోషణ కష్టంగా ఉందని, అనారోగ్యానికి గురై అప్పులు పాలవుతున్నామని కావునా పెండింగ్ వేతనాలను వెంటనే గవర్నమెంట్ అప్రూవల్ చేసి విడుదల చేయాలని అధ్యక్షుడు నయిముద్దీన్, ప్రధాన కార్యదర్శి సర్వేశ్వర రావు, ఉపాధ్యక్షుడు మురళి మోహన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.