ఇషాన్ కిషన్ ₹15.25 కోట్లు

ఐపీఎల్ 2022 ఆటగాళ్ల వేలం పాటలో భారతీయ ఆటగాడు ఇషాన్ కిషన్ 15. 25 కోట్లకు ముంబై ఇండియన్స్ టీమ్ దక్కించుకుంది.

దీపక్ చాహర్ ను సీఎస్కే జట్టు 14 కోట్లు పెట్టి దక్కించుకుంది.

శ్రేయస్ అయ్యర్ ని 12.25 కోట్లకు కొల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది.

దీనితో ఈ వేలంపాటలో అత్యంత ఖరీదైన ఆటగాడు గా ప్రస్తుతానికి ఇషాన్ కిషన్ నిలిచాడు.

ఇదిలా ఉండగా ప్రముఖ ఆటగాళ్లు అయినా సురేష్ రైనా, స్టీవ్ స్మిత్‌, షకిబ్ ఉల్ హసన్, మాథ్యు వేడ్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ నబీ, ఉమేష్ యాదవ్ లను వేలంలో ఎవరు దక్కించుకోకపోవడం విశేషం.