డా. రెడ్డీస్ ల్యాబ్ జాబ్ మేళా లో ఉద్యోగం పొందిన బీర్ పూర్ కళాశాల విద్యార్థిని

ప్రభుత్వ జూనియర్ కళాశాల – బీర్ పూర్ లో 2019-2021 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షలలో 980/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించిన తుంగూర్ గ్రామానికి చెందిన కుమారి గట్ల మమత జగిత్యాల జిల్లా కేంద్రంలో జనవరి 31న డా. రెడ్డీస్ లాబ్స్ – హైదరాబాద్ వారు నిర్వహించిన మెగాజాబ్ మేళా లో మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ వంగల రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మమతను కళాశాల ప్రిన్సిపాల్ వంగల రామకృష్ణ, లెక్చరర్లు మహేష్, జానకి, బాలమల్లయ్య,
మెండు సతీష్, నిర్మల,రాణి, మోహన్, రవీందర్, శ్రీనివాస్, రాంబాబు, రజిత అభినందించారు.