పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పెంపు

2021 – 22 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు మరియు కళాశాలలకు మరొక సారి అవకాశం కల్పిస్తూ దరఖాస్తు గడువును మార్చి – 31 – 2022 వరకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎక్కువ మంది విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లకు విధించిన గడువు లోగా దరఖాస్తు చేసుకోకపోవడంతో మరింత గడువు ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొంది.