తాడ్వాయి ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ను సందర్శించిన డా. ఈసం నారాయణ.

కాకతీయ యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణను తాడ్వాయి జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్. విభాగం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఈసం నారాయణ ఏజెన్సీ విద్యార్థుల సమగ్ర వికాసం కోసం విశేష కృషి చేస్తున్న తాడ్వాయి జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్. కన్వీనర్ అస్నాల శ్రీనివాస్ పి. ఓ. కొమ్మాల సంధ్యను ప్రంశసించారు. సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాల నిర్వహణలో తాడ్వాయి విభాగం ప్రత్యేకతను చాటుకుంటున్నదని అన్నారు. అలాగే ఒక ఆదివాసీ అవాస ప్రాంతాన్ని దత్తత తీసుకొని విద్య, ఆరోగ్యం అంశాలలో ఉన్నతి కోసం విశేష కృషి చేయాలని సూచించారు. తమ నుండి పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని అన్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ అరణ్య గర్భం నుండి ఎగిసి ఉన్నత విద్యలో వనవాసులకు ఒక ఆదర్శ నమూనాగా డా.ఈసం నారాయణ ఎదిగారని, వారి దార్శనికతతో కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం దేశంలో గొప్ప యూనిట్ గా మారుతుందని ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్ ఎస్. పి. ఓ. కొమ్మల సంధ్య, సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.ప్రవీణ్, రాజ్ కుమార్, అధ్యాపకులు రాములు నాయక్, మూర్తి, కిషన్, శ్రీలత, రాజ్ కుమార్, నాగరాజు, బిక్షం, అశోక్ విద్యార్థులు పాల్గొన్నారు.