అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలో పాల్గొననున్న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి.

భారత భూటాన్ దేశాల మధ్య ఈనెలలో భూటాన్ లో జరిగే అండర్ – ఆర్మ్ అంతర్జాతీయ క్రికెట్ పోటీలో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ. ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి నేరెల ప్రకాష్ మన దేశం తరపున ఆడనున్నట్టు కళాశాల ప్రధానాచార్యులు డా.ఆకుల సుధాకర్ తెలిపారు.

ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో విద్యార్థిని అభినందిస్తూ తమ కళాశాల విద్యార్థి ఇలా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం దేశానికే గర్వమని, ఎందరో విద్యార్థులకు ఆదర్శమని ప్రధానాచార్యులు డా.ఆకుల సుధాకర్ అభినందించారు. కళాశాల ఎన్. సి.సి. కాడెట్ గా భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు డా. సుధాకర్, స్పోర్ట్స్ ఇంచార్జి అధ్యాపకులు వినోద్ కుమార్, అధ్యాపకులు డా. వామన మూర్తి, వేణు శర్మలు పాల్గొన్నారు.