డీఐఈవో శ్రీ కృష్ణయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు – హేమచందర్ రెడ్డి

సూర్యాపేట :: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాల నుండి టీడీఎస్ కట్ చేయడం లేదని గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి జిల్లా డి.ఐ.ఈ.ఓ. / నోడల్ ఆఫీసర్లకు నోటీసులు మరియు ఫైన్ లు రావడం జరిగిన నేపథ్యంలో డి.ఐ.ఈ.ఓ/నోడల్ ఆఫీసర్లు కాంట్రాక్టు అధ్యాపకులు టీడీఎస్ పరిధిలోకి రారు అని ఐటీ శాఖకు అప్పీల్ చేయడం జరిగింది. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా డి.ఐ.ఈ.ఓ. జానాపాటి కృష్ణయ్య చేసిన అప్పీల్ ను ప్రత్యుత్తరంగా కాంట్రాక్టు అధ్యాపకులు సెక్షన్ 194j పరిధిలోకి రారు అని 192(1) పరిధిలోకి వస్తారు అని స్పష్టమైన సమాధానంగా పంపండం జరిగిందని హేమచందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విషయంలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు జరుగుతున్న నష్టాన్ని గ్రహించి కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు 10 శాతం టి డి ఎస్ పేరిట కోత విధించడం సరైనది కాదని ఐటీ అధికారులకు సవివరంగా లెటర్ రాసిన సూర్యాపేట డి.ఐ.ఈ.ఓ. జానాపాటి కృష్ణయ్యకి మరియు అనునిత్యం టిడిఎస్ పేరిట కోత విధించడం వల్ల జరిగే అన్యాయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ద్వారా మరియు ఇతర ప్రజాప్రతినిధుల ద్వారా ఐటీ అధికారుల దృష్టికి అనేక పర్యాయాలు తీసుకెళ్ళిన కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జేఏసీ చైర్మన్ కనకచంద్రంలకు TGCCLA-711 సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి జిల్లా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.