తడ్వాయి కళాశాల టాపర్స్ కు పోటీ పరీక్షల పుస్తకాలను బహుకరించిన సుష్మారెడ్డి

లక్ష్య సాధన కోసం మహనీయుల జీవితాలు స్పూర్తిగా తీసుకోవాలని అని ప్రవాస భారతీయురాలు, యువ ఇంజనీర్ సుష్మారెడ్డి అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్పూర్తిదాయక వ్యక్తుల పరిచయ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్ధి జీవితంలో సమయాన్ని అర్ధవంతంగా వాడుకోవాలని కోరారు. శ్రమతో, మేధస్సుతో నిర్మితమైన సమాజంలో జడత్వానికి చోటు ఇవ్వరాదని అన్నారు. వరంగల్, గోవా బిట్స్ పిలాని, అమెరికా నార్త్ కేరోలినా యూనివర్సిటీలో జరిగిన తన విద్యాభ్యాసం గురించి చెపుతూ విద్యార్థులలో ప్రేరణ కలిగించారు.

ఈ సందర్బంగా ఇంటర్ పరీక్షల్లో టాపర్స్ నిలిచిన విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను బహుకరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ
మాతృభూమిపై మమకారంతో వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ విద్యాసంస్థలకు సహకారాన్ని అందిస్తున్న సుష్మారెడ్డి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉషారాణి, అధ్యాపకులు శ్రీలత, మూర్తి, కిషన్, అశోక్, రాజు, బిక్షం, నాగరాజు, రాజకుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.