సీజేఎల్స్ పోస్టింగ్ కోసం విద్యా శాఖ మంత్రికి వినతిపత్రం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీవో 317 అమలు కారణంగా డిస్ట్రబ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు తిరిగి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఈ రోజు హైదరాబాదులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి 475 సంఘం తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కొప్పిశెట్టి సురేష్ తెలిపారు

ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని,
ఈ విషయాన్ని ఇంటర్ విద్య కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా రీ అలాట్మెంట్ అయ్యేటట్లు చూస్తానని హామీ ఇవ్వడం జరిగిందని కొప్పిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.