ప్రాక్టికల్ మరియు థియరీ పరీక్షలు యధాతధం గా ఉంటాయి – ఇంటర్ బోర్డ్ ప్రకటన

  • ఇది సాదరణ విద్యా సంవత్సరమే
  • అపోహలు నమ్మవద్దు – పరీక్షలు యధాతథంగా ఉంటాయి.
  • రెండు రోజుల్లో పరీక్షల షెడ్యుల్ విడుదల.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది ఉంటాయా.? అని మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవ దూరంగా ఉన్నాయని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటన జారీ చేసింది. గతేడాది 45 రోజులు మాత్రమే భౌతిక తరగతులు నిర్వహించడం వల్ల ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండా మార్కులు కేటాయించినట్లు స్పష్టం చేసింది.

ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి ఆన్లైన్ తరగతులు సెప్టెంబర్ నుండి భౌతిక తరగతులు నిర్వహించామని… కేవలం జనవరిలో 14 రోజులు మాత్రమే కోవిడ్ కారణంగా తరగతులు నిర్వహించకుండా ఉన్నామని తెలిపారు. మరల ఫిబ్రవరి 1 నుండి పూర్తి స్థాయిలో భౌతిక తరగతులు కొనసాగుతున్నయని కావున ప్రాక్టికల్ మరియు థియరీ పరీక్షలు యథాతథంగా ఉంటాయని… విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షల నిర్వహణ పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దని పరీక్షలను యథాతథంగా జరిపి తీరుతామని స్పష్టం చేశారు.

ఒకటి రెండు రోజులలో ప్రాక్టికల్స్ మరియు థియరీ పరీక్షలకు సంబంధించిన నూతన షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.