నేటి నుంచి మళ్లీ డిజిటల్ తరగతులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుక్రవారం నుంచి డిజిటల్ పాఠాలు ప్రసారం చేయనున్నట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

టీ-శాట్ (విద్య, నిపుణ చానల్స్) ద్వారా ఈ నెల 8 వరకూ పాఠాలు కొనసాగుతాయని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గింది. దీనికి తోడు హైకోర్టు ఈ నెల 28 వరకూ ఆన్లైన్ తరగతులను అందుబాటులో ఉంచాలని ఆదేశించిన నేపథ్యంలో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తున్నారు.