TGDCLA క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ యొక్క నూతన సంవత్సర కాలెండర్ ను రాష్ట్ర ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ఈ రోజు ఆవిష్కరింపజేయడం జరిగిందని అధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి దృష్టికి సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, డిస్టర్బ్ కాంట్రాక్టు లెక్చరర్లను తిరిగి విధులలోకి వెంటనే తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని పై సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్, మరియు రాష్ట్ర నాయకులు డా. సువర్ణ దేవి, శ్రీనివాస్, కిషోర్, ప్రభాకర్, ప్రమీల, సంగీత, జోత్స్న తదితరులు పాల్గొన్నారు.