కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు బదిలీలు, డిస్ట్రబ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు పోస్టింగ్ ఇవ్వాలి – 475 సంఘం

ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు బదిలీలు అవకాశం కల్పించాలని, డిస్ట్రబ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు వెంటనే రీ అలాట్మెంట్ అవకాశం కల్పించాలని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
కే. చంద్రశేఖర రావుకి ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష &ప్రధాన కార్యదర్శులు జి. రమణారెడ్డి, డాక్టర్. కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2000 సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తూ ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, గత 12 సంవత్సరాలుగా బదిలీలు లేకపోవడం వల్ల కాంట్రాక్ట లెక్చరర్ కుటుంబాలు అనేక ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని… ఇలాంటి పరిస్థితుల్లో గత మూడు సంవత్సరాలుగా కాంట్రాక్టు లెక్చరర్స్ బదిలీలు గురించి, అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో 2020 నవంబర్ నెలలో ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ స్థానచలనం గురించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సానుకూల ప్రకటన ఇవ్వడం జరిగిందని.. కానీ ఇంతవరకు ఈ విషయంపై అధికారులు ఎలాంటి మార్గదర్శక సూత్రాలు ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్ట్ లెక్చరర్స్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఈ నేపథ్యంలో కొత్త జోనల్ విధానాన్ని పెట్టడం జరిగిందని.. అన్ని డిపార్ట్ మెంట్ లో కూడా రెగ్యులర్ ఉద్యోగులకు 317 జీవో ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని గుర్తు చేశారు.

తాజాగా రెగ్యులర్ ఉద్యోగులకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవకాశం కూడా కల్పించడం జరిగిందని .
ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ లెక్చరర్స్ బదిలీ విషయంలో మార్గదర్శకాలు వచ్చేటట్లు కోరుతూ కింద విషయాలను వెంటనే పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

1)కాంట్రాక్ట్ లెక్చరర్ కు వెంటనే బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయాలి.

2) 317 జీవో అమలు వలన రెగ్యులర్ లెక్చరర్ వల్ల డిస్ట్రబ్ అయినా కాంట్రాక్ట లెక్చరర్స్ కు వెంటనే కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి తిరిగి అలాట్మెంట్ చేయాలి.

3) కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు మెడికల్/ పరస్పర/ స్పౌజ్ బదిలీలు సౌకర్యం కల్పించాలి.

ఈ పై విషయాలను సానుకూలంగా పరిశీలించవలసిందిగా వినతి పత్రం పంపించినట్లు తెలిపారు.

★ విద్యాశాఖ మంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి కి & అధికారులకు వినతి పత్రాలు

317 జీవో ద్వారా డిస్టబ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్ కు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలిటెక్నిక్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలో డిస్టర్బ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు తిరిగి రీ అలాట్మెంట్ చేశారని కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్టబ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు ఇంతవరకూ అలాట్మెంట్ చేయకపోవటం సరికాదని , వారి ఇబ్బందుల్ని పరిశీలించి వెంటనే రీ అలాట్మెంట్ చేయవలసిందిగా వినతి పత్రం సమర్పించారు.

ఈరోజు గౌరవ విద్యా శాఖ మాత్యులు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మాత్యులు హరీష్ రావుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎడ్యుకేషన్ సెక్రటరీకి, ఇంటర్మీడియట్ కమిషనర్ కి ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ రాష్ట్ర కోశాధికారి నాయిని శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కే.పి. శోభన్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్, కురుమూర్తి, గోవర్ధన్, గంగాధర్, సాయిలు, ప్రవీణ్, వైకుంఠం, వైలెన్ రెడ్డి, మధుకర్, రాష్ట్ర మహిళా కార్యదర్శి సంగీత, శైలజ, ఉదయశ్రీ తదితరులు తెలిపారు.