SSC : కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాదాపు మూడు వేలకు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉంది.

● పోస్టుల వివరాలు :- స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ పరీక్ష ద్వారా లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు.

● అర్హతలు :- సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

● వయోపరిమితి :- వయసు 01-01-2022 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

● పరీక్ష విధానం ::

మొత్తం రెండు విధానాల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అందులో మొదటిది టైర్‌-1 పరీక్ష దీనిని 200 మార్కులకి ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఇస్తారు.

టైర్‌-2 పరీక్షను డిస్క్రిప్టివ్‌ పేపర్‌ రూపంలో నిర్వహిస్తారు.

  • పేపర్‌ – 1 200 మార్కులకు,
  • పేపర్‌ – 2 100 మార్కులకు ఉంటుంది.

● దరఖాస్తు విధానం :- ఆన్లైన్ ద్వారా.

● ఎంపిక విధానం :- అభ్యర్థులను టైర్‌1, టైర్‌2, స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

● ఆన్లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ :: 01-02-2022

● ఆన్లైన్‌ దరఖాస్తులు చివరి తేదీ :- 07-03-2022.

● ఆన్లైన్‌ ఫీజు చెల్లిండానికి చివరి తేదీ :- 08-03-2022

● పరీక్ష తేదీలు :-

  • టైర్‌1 పరీక్ష – మే – 2022.
  • టైర్‌2 తేదీని ఇంకా ప్రకటించలేదు.

వెబ్సైట్ :- https://ssc.nic.in/