క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు ఈ ఏడాది ఆర్బీఐ ద్వారా త్వరలో డిజిటల్ కరెన్సీ తీసుకురానున్నట్లు వెల్లడించారు.
రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ తీసుకొస్తామన్నారు. కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో భాగంగానే డిజిటల్ కరెన్సీల రూపకల్పన చేయనున్నట్లు వివరించారు. డిజిటల్ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం వస్తుందన్నారు నిర్మలా సీతరామన్.