జనవరి – 31 నుండి విద్యా సంస్థలు పునఃప్రారంభం.!

తెలంగాణ లో విద్యా సంస్థలు జనవరి – 31 నుండి పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సాయంత్రం జారీ కానున్నట్లు సమాచారం. కరోనా ఉధృతి కారణంగా విద్యా సంస్థలకు జనవరి – 8 నుండి 30 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలను తెరవాలని, విద్యా సంస్థల ఆవరణలో అందరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని, ప్రతిరోజూ శానిటేషన్ చేయాలని, శానిటైజర్ లు అందుబాటులో ఉంచాలని… ఐసోలేషన్ గదులను అందుబాటులో ఉంచాలనే నిబంధనలు విధించి విద్యా సంస్థల పునఃప్రారంభానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది.

ఆన్లైన్, ఆఫ్ లైన్ తరగతులు విషయం మీద ఉత్తర్వులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.