విద్యా సంస్థలు ఫిబ్రవరి – 01 నుండి ప్రారంభం – సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ లో విద్యా సంస్థలు ఫిబ్రవరి – 01 నుండి పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా ఉధృతి కారణంగా విద్యా సంస్థలకు జనవరి – 8 నుండి 30 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.వాటిని 31 వరకు పొడిగించినట్లు తెలిపారు.

అయితే కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలను తెరవాలని, విద్యా సంస్థల ఆవరణలో అందరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని, ప్రతిరోజూ శానిటేషన్ చేయాలని, శానిటైజర్ లు అందుబాటులో ఉంచాలని… ఐసోలేషన్ గదులను అందుబాటులో విద్యా సంస్థలు ఉంచాలని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు