ఇంటర్ తో 1149 కానిస్టేబుల్ ఉద్యోగాలు

సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశ వ్యాప్తంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● మొత్తం ఖాళీలు :: 1149 కానిస్టేబుల్ (ఫైర్ మెన్) పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 30, ఆంధ్రప్రదే లో 79 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

● అర్హతలు :: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ తో పాటు తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి. నిర్దేశించిన ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి.

● వయోపరిమితి :: 4 మార్చి 2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

● వేతనం :: పే లెవల్ 3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి 69,100+ ఇన్సెంటివ్స్ అదనంగా చెల్లిస్తారు.

● ఎంపిక విధానం :: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

● పరీక్ష విధానం :: పీఈటీ, పీఎస్టీ లో అర్హత సాధించిన అభ్యర్థులను రాతపరీక్షకు ఎంపికచేస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు మల్టీపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు ఇస్తారు. పరీక్షకు 120 నిమిషాల సమయం కేటాయిస్తారు. హిందీ, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ లేదు.

● ఫీజు వివరాలు :: జనరల్ అభ్యర్థులు రూ.100 (ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేటకు ఫీజు లేదు.)

● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్ లో

● ప్రారంభ తేదీ :: జనవరి 29 – 2022.

● చివరి తేదీ :: మార్చి 4 – 2022

● వెబ్సైట్ :: www.cisfrectt.in