- తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలు – టీటీడబ్ల్యూఆర్ జేసీ సెట్ – 2022
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TTWREIS) 2022 – 2023 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 83 గురుకుల జూనియర్ కళాశాలలు, ఇతర ప్రతిభా కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది జనరల్, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
● అర్హత :: రెగ్యులర్ విధానంలో మే 2022లో జరిగే పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. 1,50,000 పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 మించకుండా ఉండాలి.
● వయోపరిమితి :: 31.08.2022 నాటికి 17 ఏళ్లు మించకుండా ఉండాలి.
● ఎంపిక విధానం :: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TTWRJC CET) ఆధారంగా.
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది :: ఫిబ్రవరి – 27 – 2022
● పరీక్ష తేది :: మార్చి – 21 – 2022
● వెబ్సైట్ :: www.tgtwgurukulam.telangana.gov.in/