ఓటర్లను చైతన్య పరచడంలో నిత్య కృషివడుడు : వైద్య శేషారావు

కామారెడ్డి జిల్లా : ప్రభుత్వ జూనియర్ కళాశాల దోమకొండలో రాజనీతి శాస్త్ర ఒప్పంద అధ్యపాకుడిగా పనిచేస్తున్న వైద్య శేషారావు ఓటు హక్కు పట్ల ఉదాసీనత తొలిగి పోవాలని, దాని స్ఫూర్తిని ఓటు హక్కు నమోదు ప్రక్రియనుంచి వినియోగించుకునే వరకు దాని విలువను విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత నిరక్షరాస్యులకు అవగాహన కల్పిస్తున్న నిత్య కృషివలుడు.

చాలా మందికి ఓటు హాక్కు విలువ తెలియదు… ప్రాజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం. భారత రాజ్యాంగం 18 సంత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించింది. రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కు పట్ల ఉదాసీనత తొలిగి పోవాలని కవితా‌ వచన, గేయ రూపాలలో పూర్తిగా గ్రామీణులు మాట్లాడే భాషలో సామెతలు రాసి ఓటు విలువను శేషారావు తెలియచేస్తూ తన సామాజిక సేవను కొనసాగిస్తున్నారు.

ప్రతి సంత్సరం ఓటరు దినోత్సవం సందర్బంగా 18 సంవత్సరాలం వచ్చిన వయోజనులకు పిల్లల కు ప్రత్యేకంగా ఓటు నమోదు దరఖాస్తులు నింపి ఓటును పొందే పద్ధతిని.. ఆన్లైన్ లో ద్వారా నమోదు పద్ధతిని వివరించి అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన పుస్తకాలు సమకూర్చి “లింకన్ క్లబ్” పేరిట నిర్వహిస్తున్నారు.

ఓటు, చిత్తు కాగితం, సిత్రాలు, మారింది అంతే, జర సొంచో, దేవత మన ఓటు లాంటి కవితలతో నిత్యం చైతన్యం కల్పిస్తున్నారు.