ఫిబ్రవరి 5 తర్వాతే విద్యాసంస్థలు ప్రారంభం.!

  • వైద్య ఆరోగ్య శాఖ నివేదిక

తెలంగాణలో కోవిడ్ థర్డ్ కారణంగా జనవరి 8 నుండి మూతపడ్డ విద్యాసంస్థలను ఫిబ్రవరి 5 తర్వాత తెరిచే అవకాశాలను పరీశీలించవచ్చని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. విద్యార్థులు, తల్లిదండ్రులు అభీష్టం మేరకు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ తరగతులను నిర్వహించుకోవచ్చని నివేదిక లో పేర్కోనట్లు సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో పాజిటివిటి రేట్ 20 శాతానికి పైనే ఉందని కావున కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలు తెరవకుండా తక్కువగా ఉన్న జిల్లాల్లో పునః ప్రారంభించాలని… అలాగే పబ్లిక్ పరీక్షలు మరియు ప్రవేశ పరీక్షలను యధావిధిగా నిర్వహించుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ సూచించినట్లు సమాచారం.

రేపు సీఎం కేసీఆర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రావు నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.