ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచాలి – TIPS

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఏలాంటి అపరాధ రుసుము లేకుండా వార్షిక పరీక్షల ఫీజు చెల్లించడానికి ఈ నెల 24వ తేదీ వరకు గడువును విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యె వరకు పెంచాలని తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది.

ప్రస్తుతం కరోనా మూడవ రూపంలో వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 30వ తేది వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారి తరపున ప్రతినిధులు కళాశాలలకు వచ్చి పరీక్ష ఫీజులు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసిక ఒత్తిడితో అందోళన చెందుతున్నారని తెలిపారు.

కావున ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రస్తుత వాస్తవ పరిస్థితులు గమనించి కళాశాలలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించే విధంగా తేదిలను మార్పు చేయాలని టిప్స్ రాష్ట్ర సమన్వయ కర్త యం. జంగయ్య, రాష్ట్ర కన్వీనర్ లు యం. రామకృష్ణ గౌడ్, వేముల శేఖర్, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, కే. నగేష్, యం.డీ. రహీమ్ లు విజ్ఞప్తి చేశారు.