టీజీవోస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఇంజనీర్లే దేశ ప్రగతికి చోదకులు అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా కోర్దినేటర్ అన్నమనేని జగన్మోహన్ రావు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యానవన శాఖ కార్యాలయంలో టిజిఓ న్యూస్ సహాయ సంపాదకులు అస్నాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థుల సంఘం వరంగల్ విభాగం మరియు తెలంగాణ రహదారులు భవనాల గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన క్యాలెండర్ ను జగన్ మోహన్ రావు గారు ఆవిష్కరించారు.

సామాజిక బాధ్యతతో నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం పేదల కోసం, ప్రభుత్వ విద్యా సంస్థలకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్పూర్తి దాయకంగా ఉన్నాయని అన్నారు.

NITW అధ్యక్షుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక దేవాలయాలైన అనేక ప్రాజెక్టులను నిర్మించడంలో నిట్ వరంగల్ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు అని అన్నారు. రామప్ప దేవాలయంకు యునెస్కో వారసత్వ జాబితాలో స్థానం కోసం నిట్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించారు అని అన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు సంస్కృతికి చిహ్నమైన ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసము కృషి చేస్తానని చేస్తానని అన్నారు.

టిజిఓ కేంద్ర సంఘ మరియు ఇంజనీర్ల గెజిటెడ్ అధికారుల సంఘ కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అనేక సాగునీరు ప్రాజెక్ట్ లు, రహదారుల నిర్మాణంలో ఇంజనీర్లు అహోరాత్రులు పని చేస్తున్నారని అన్నారు.

ఈ సమావేశంలో టిజిఓ వరంగల్ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఏ డి సురేష్ కుమార్, జె డి హరిప్రసాద్, ఈ ఈ కుమారస్వామిలతో పలువురు టిజిఓ సభ్యులు పాల్గొన్నారు.