కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు వెంటనే రీపోస్టింగ్ అవకాశం కల్పించాలి – జంగయ్య, కొప్పిశెట్టి సురేష్

317 జీవో ప్రకారం రెగ్యులర్ జూనియర్ లెక్చరర్స్ ట్రాన్స్ఫర్ వలన ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు తిరిగి వెంటనే అవకాశం కల్పించాలని ఈరోజు ఇంటర్ విద్య కమిషనర సయ్యద్ ఉమర్ జలీల్ కి వినతి పత్రం ఇచ్చినట్టు యం. జంగయ్య , మరియు డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, ఎం. శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ తెలిపారు.

రెగ్యులర్ లెక్చరర్స్ ట్రాన్స్ఫర్ వల్ల సుమారు 50 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉద్యోగాలు కోల్పోయారని… ఇంతవరకూ వీరికి తిరిగి అవకాశం కల్పించకపోవడం వలన చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ప్రస్తుతం ఉన్న ఖాళీ లో అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ హ317 జీవో ప్రకారం బదిలీలు ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు అవకాశం కల్పిస్తామని తెలియజేశారని ఒక ప్రకటనలో జంగయ్య, కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.