ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షల – 2022 ఫీజులను చెల్లింపుకు ఫిబ్రవరి 4 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు గడువును పెంచినది.

కరోనా కారణంగా విద్యా సంస్థలకు సెలవు పొడిగించడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు 200/- అపరాధ రుసుముతో ఫిబ్రవరి 10 వరకు, 1000/- అపరాధ రుసుముతో ఫిబ్రవరి 17 వరకు, 2000/- అపరాధ రుసుముతో ఫిబ్రవరి 24 వరకు ఫీజు చెల్లించుటకు గడువు కలదు.