పాఠశాలలకు 50% టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది హజరు కావాలి

జనవరి 24 నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. కరోనాతో విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం నుంచి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది.

50శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.