ఇంటర్ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ఆదేశాలు

ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు జనవరి 30 వరకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ కమిషనర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రిన్సిపాల్ లు హజరై అకాడమిక్ మరియు పాలనపర విషయాలను చూసుకోవాలని… లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతిరోజు హాజరవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే టీచింగ్ స్టాఫ్ అకడమిక్ కాలెండర్ ప్రకారం ఆన్లైన్ క్లాసులు, జూమ్ క్లాస్ లు విద్యార్థులకు తీసుకోవాలని స్పష్టం చేశారు. T SAT మరియు యూట్యూబ్ లో ఉన్న తరగతులను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.