పరీక్షల రద్దు ప్రసక్తే లేదు – సబితా ఇంద్రారెడ్డి

  • జనవరి 31 నుంచి పునః ప్రారంభించే యోచన

తెలంగాణలో విద్యా సంస్థలను జనవరి 31 నుంచి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

కరోనా తీవ్రత నెలాఖరుకు క్రమంగా తగ్గితే 31 నుంచి విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై అధికారుల నుంచి నివేదిక కోరినట్టు మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే, కరోనా తీవ్రత పెరిగితే సెలవులు పొడిగించకతప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ క్లాసులపై క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించగా, కొద్ది రోజుల కోసం ఎందుకన్నట్టు బదులిచ్చారు. దీన్నిబట్టి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం బలమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

★ పరీక్షల రద్దు ప్రసక్తే లేదు ::

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పరీక్షల రద్దు, ప్రమోట్‌ చేయడం వంటివి ఉండబోవని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తేల్చి చెప్పారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని అన్నారు. విద్యార్థులు ఏలాంటి ఆశలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ పరీక్షల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని చెప్పారు.