ఒకేషనల్ పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లకు అందని పీఆర్సీ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 54 మంది ఒకేషనల్ పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లుగా 1994వ సంవత్సరం నుండి పని చేస్తున్నారు. వీరందరూ 45 సంవత్సరాల వయసు పైబడిన వారే. వీరందరీ సర్వీస్ దాదాపు 25 సంవత్సరాల పైబడినది. రెగ్యులర్ లెక్చరర్స్ లాగే ఉదయం నుండి సాయంత్రం వరకు ఫుల్ టైం గా కాలేజీ లో ఉంటూ విద్యాబోధన చేస్తున్నారు. కానీ వీరికి వేతనాలు పెంచకపోవడం వలన మీరు కేవలం నెలకు 21,600/- మాత్రమే పొందుతున్నారు. ప్రస్తుతం జూనియర్ లెక్చరర్ బేసిక్ పే. 54, 220 గా ఉన్నది. కావునా సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి సమాన పనికి సమాన వేతనం అందించవలసినదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్స్ 5 కేటగిరీలుగా ఉన్నారని.

  • (1) రెగ్యులర్ రెగ్యులర్
  • (2) పార్ట్ టైం మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ (1993 ముందు)
  • (3 )పార్ట్ టైం లెక్చరర్స్ (1993 – 1999)
  • (4) కాంట్రాక్ట్ లెక్చరర్స్ ,(2000 -2013).
  • ( 5) గెస్ట్ లెక్చరర్స్ (2013 తరువాత)

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1989వ సంవత్సరంలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టి వాటిని బోధించుటకు రెగ్యులర్ లెక్చరర్లను నియమించకుండా పార్ట్ టైం పద్ధతిన నియమించారు. ఆ సమయంలో రెగ్యులర్ సిస్టం మరియు పార్ట్ టైం సిస్టం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా 1999 వ సంవత్సరం వరకు నియమిస్తూ వచ్చినారు.

ఈ విధంగా నియమితులైన పార్ట్ టైం లెక్చరర్లలో అనేక మందిని ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఈ లెక్చరర్స్ ప్రిన్సిపాల్ గా,జిల్లా ఇంటర్ విద్యాధికారిగా ఉద్యోగోన్నతి పొంది వారి సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్ బోర్డ్ లో కూడా వివిధ హోదాలలో పని చేస్తున్నారు. రెగ్యులర్ కాకుండా 1993 వ సంవత్సరం వరకు నియమితులైన పార్ట్ టైం లెక్చరర్స్ కు వేతనం అప్పుడు ఉన్న రెగ్యులర్ లెక్చరర్స్ బేసిక్ పే మరియు డి ఎ చెల్లిస్తున్నారు. 2000 – 2001 నుండి నియమితులైన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు 11 పి ఆర్ సి ప్రకారం 54,220/- వెతనంగా చెల్లిస్తున్నారు.

1994వ సంవత్సరం నుండి 1999వ సంవత్సరం వరకు నియమితులైన పార్ట్ టైం లెక్చరర్స్(53మంది)కు ఇప్పటికీ కొనసాగుతున్న వీరికి ప్రస్తుతం అమల్లో ఉన్న పిఆర్సి కమిషన్ ప్రకారం వేతనాలు పెంచకపోవడం వలన వీరు కేవలం నెలకు 21,600/- మాత్రమే పొందుతున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న 11 పి ఆర్ సి ప్రకారం రెగ్యులర్ లెక్చరర్స్ బేసిక్ పే 54,220/- ఉన్నది. మాకు కూడా మొత్తం వేతనంగా 54,220/- రూపాయల అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఒకేషనల్ పార్ట్ టైమ్ లెక్చరర్స్ అయిన వీరికి సంబంధించి HIGHER EDUCATION (IE/A1) DEPARTMENT G.o.No.95., Dated:- 25-06- 2019. ప్రకారం ప్రతీ సంవత్సరం 12నెలలు నెలకు 21,600/- రూపాయలు కన్సాలిడేటెడ్ పే గా చెల్లించవలసిందిగా జీవో విడుదల చేసినారు, కానీ దానికి సంబంధించి సపోర్టింగ్ ఆర్డర్స్ ను ఇంత వరకు విడుదల చేయలేదు. కావునా వెంటనే సపోర్టింగ్ ఆర్డర్స్ విడుదల చేసి న్యాయం చేయాలని కాల్వ సర్వేశ్వరరావు, పోతు సుధాకర్, శ్రీ రాములు,
సముద్రాల శ్రీనివాస్, నిసార్ అహ్మద్ తదితరులు ప్రభుత్వానికి, ఇంటర్మీడియట్ కమీషనర్ కు విజ్ఞప్తి చేశారు.