ఉద్యోగుల డీఏ @ 17.29%

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 17.29% డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు 7.28% ఉన్న డీఏకు జనవరి, జూలై – 2020, జనవరి – 2021 ల మూడు డీఏలను కలిపి 17.29% గా నిర్ణయించారు.

ఈ నూతన డీఏ జనవరి -01 – 2022 నుండి అమలులోకి వస్తుందని ఉత్తర్వులలో తెలిపారు.

జీపిఎప్ ఉద్యోగులకు జూలై – 2021, డిసెంబర్- 2021 కి సంబంధించిన డీఏ ఏరియర్స్ జీపీఎప్ ఎకౌంటు లోకి జమ అవుతాయి.

సీపీఎస్ ఉద్యోగులకు డీఏ ఏరియర్స్ 10% సీపీఎస్ ఖాతాలోకి, మిగిలిన 90% ఏరియర్స్ ను 2022 – మే‌, జూన్, జూలై నెలల్లో మూడు వాయిదా లలో చెల్లిస్తారు.