డిస్టర్బ్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వండి – గాదె వెంకన్న, శ్రీపతి సురేష్

  • ఇంటర్ కమిషనర్ ను కలిసిన ఆర్జెడి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం – గాదె వెంకన్న.

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ అధ్యాపకుల మల్టీ జోనల్ కేటాయింపుల వల్ల డిస్టర్బ్ అయినటువంటి 33 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని ఆర్జేడి కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న , రాష్ట్ర కార్యదర్శి శ్రీపతి సురేష్ బాబు ఇంటర్ కమిషనర్ జలీల్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డిస్టర్బ్ అయిన కాంట్రాక్ట్ అధ్యాపకులు పోస్టింగ్స్ కోసం ఎదురుచూస్తూ ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

సియం ఆదేశాలు అమలు చేయండి : గాదె వెంకన్న
14 సంవత్సరాలు గా వందల మైళ్ళ దూరంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీల కొరకు ముఖ్యమంత్రి అదేశించి 15 నెలలు గడుస్తున్నా ఆ దిశగా చర్యలను తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని గుర్తు చేయగా… బదిలీల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే బదిలీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కమీషనర్ అన్నారని వెంకన్న తెలిపారు.

317 జి.ఓ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తింపచేయాలి
ప్రభుత్వ నూతన జోనల్ విద్య ఈ వ్యవస్థలో భాగంగా 317 జీవో ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు కూడా ఆప్షన్లు కేటాయించాలని ఆర్జెడి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఓ ప్రకటన లో తెలిపారు.నాన్ లోకల్ జోన్లలో పని చేస్తున్నటువంటి అధ్యాపకులకు లోకల్ మల్టిజోన్లకు పంపించే విధంగా ఆప్షన్లు కేటాయించాలని వారు ఈ సందర్భంగా మ కమిషనర్ కి విన్నవించడం జరిగింది.