ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజులు చెల్లింపు గడువును పెంచాలి – 475 అసోసియేషన్ విజ్ఞప్తి.

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్ష ఫీజు చెల్లించే గడువును పొడిగించాలని ఈరోజు విద్యా శాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డికి, విద్యాశాఖ సెక్రెటరీ మరియు ఇంటర్ బోర్డు కార్యదర్శులకు ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష & కార్యదర్శులు
జీ. రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం చదివే విద్యార్థులు జనవరి 24 వరకు ఏలాంటి అపరాధ రుసుము లేకుండా, తమ వార్షిక పరీక్ష ఫీజును చెల్లించాలని పేర్కొనడం జరిగిందని కానీ కోవిద్ నేపద్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ లకు ఈనెల 17 నుంచి 30 వరకు సెలవులు పొడిగించడం జరిగింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కళాశాల మూసివేయడం జరిగిందని, దీంతో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం లేదని, ఇలాంటి పరిస్థితులలో అపరాధ రుసుము లేకుండా, సెలవుల అనంతరం విద్యార్థుల ఫీజు చెల్లించే విధంగా పరీక్ష ఫీజు తేదీలను పొడిగించాలని కోరారు,

దీనివల్ల సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. శ్రీనివాస్ , కోశాధికారి యన్. శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కే.పి.వశోభన్ బాబు, అధికార ప్రతినిధి సయ్యద్ జెబి ఉల్లా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు దేవేందర్, కురుమూర్తి , గోవర్ధన్, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, సాయిలు, మహిళా కార్యదర్శులు సంగీత, శైలజ, రమాదేవి తదితరులు తెలిపారు.