ఆ విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా

సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’(ఎఫ్.సి.ఆర్.ఐ) లో బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్ ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది.

ఎఫ్.సి.ఆర్.ఐ. లో విద్యనభ్యసించి అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాల్లో 25%, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగంలో 50%, ఫారెస్టర్స్ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు