ఓయూ పరిధిలోని కళాశాలలకు సెలవులు పొడిగింపు

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మరియు అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు జనవరి 30 వరకు సెలవులను పొడిగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం కరోనా కేసుల పెరుగుదల కారణంగా విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఈరోజు జీవో నెంబర్ 4న విడుదల చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి.

అలాగే జనవరి 17 నుండి జనవరి 30 వరకు డిగ్రీ మరియు ఫీజీ తరగతులను ఆన్లైన్ పద్ధతిలో బోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ లను ఆదేశించడం జరిగింది.