జూనియర్ కళాశాలలకు సెలవులు పొడిగింపు ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల సమయంలో ఎలాంటి భౌతిక తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.