విద్యాసంస్థలకు సెలవు పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు

కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వైద్యకళాశాల మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు జీవో నంబర్ 4 ఉత్తర్వులలో పేర్కొన్నారు.