క్రమబద్ధీకరణ కై సీఎం కు వినతి పత్రం – గాదె వెంకన్న, కుమార్

రేపు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో జీవో నంబర్ 16 ప్రకారం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని వీలయినంత త్వరగా క్రమబద్దీకరణ చేసి వేలాది మంది కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆన్లైన్ ద్వారా సీఎం కేసీఆర్ కు మరియు సీఎస్ సోమేశ్ కుమార్ లకు వినతిపత్రం అందజేశామని గాదె వెంకన్న, కుమార్ లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో చిరుద్యోగుల కోసం అనేక రకాలుగా కృషి చేయడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా కనీస వేతనం అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా చరిత్రాత్మక మార్పు తీసుకురావడం అభినందనీయమని ఆర్జేడీ అపాయింటెడ్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గాదె వెంకన్న, యార కుమార్ లు తెలిపారు.

★ త్వరలోనే డిస్ట్రబ్ సీజేఎల్స్ కు కౌన్సెలింగ్ ::

అలాగే జీవో నెంబర్ 317 వలన డిస్టర్బ్ అయిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని కమిషనర్ ని పోన్ ద్వారా కోరగా వీలైనంత త్వరగా కౌన్సిలింగ్ నిర్వహించి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ లకు పోస్టింగ్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు గాదె వెంకన్న తెలిపారు.