విద్యా సంస్థల ప్రారంభం పై సబితా ఇంద్రారెడ్డి

కరోనా థర్డ్ వేవ్ దేశంలో ప్రారంభం అవుతున్న దశలో సంక్రాంతి సెలవులను కొన్ని రోజులు ముందుగానే ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తిరిగి విద్యా సంస్థలను పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనా సమయంలో విద్యాశాఖ నిర్వహించడం చాలా కష్టంతో కూడిన విషయమని… విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్యం రెండూ ముఖ్యమైనవే అని ఈ సందర్భంగా తెలిపారు. విద్యా సంస్థల పునఃప్రారంభం అనేది వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. గతేడాది విద్యాసంవత్సరం పునఃప్రారంభించినప్పుడు మొదట్లో కొన్ని కరోనా కేసులు వచ్చాయని తర్వాత తర్వాత కేసులు తగ్గాయని గుర్తు చేశారు.

ఆన్లైన్ తరగతుల కోసం పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తరువాతనే డిడి యాదగిరి ఛానల్ ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థలో చదివే విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను చేరువ చేశామని గుర్తు చేశారు. ఆన్లైన్ తరగతులు ఉనప్పటికీ ప్రత్యక్ష బోధన అనేది చాలా ముఖ్యమైనది అని తెలిపారు.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో తక్కువ శాతం విద్యార్థులు పాస్ కావడం గత రెండేళ్లుగా విద్యార్థులు పరీక్షలు రాయగా పోవడమే కారణమని, అలాగే ప్రత్యక్ష బోధన పూర్తి స్థాయిలో లేకపోవడం వలన ఉత్తీర్ణత శాతం తగ్గిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.