ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి ‐ కొప్పిశెట్టి సురేష్

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెగ్యులర్ జూనియర్ లెక్చరర్స్ ట్రాన్స్ఫర్ వలన ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు వెంటనే రీ అలాట్మెంట్ చేయాలని ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియాకి ఆన్లైన్ ద్వారా వినతి పత్రం పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
జీ. రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీవో నెంబర్ 317 వలన రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు మల్టీ జోన్ 1, 2 అలాట్మెంట్ కావడం వలన అక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని… వారికి వెంటనే ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఖాళీగా ఉన్న అన్ని స్థానాలు చూపి,
వారి వారి సొంత జిల్లాలకు, సొంత జోన్లకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరారు.

అదేవిధంగా స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు.

★ ఇంటర్మీడియట్ కమీషనర్, ఆర్జేడిలకు వినతి పత్రం

రెగ్యులర్ లెక్చరర్ అలాట్మెంట్ ల వలన ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు వెంటనే తిరిగి అవకాశం కల్పించాలని… ఈరోజు ఇంటర్ విద్యా కమిషనర్, మరియు ఆర్జెడి వరంగల్ లకు వినతి పత్రం ఆన్లైన్ ద్వారా పంపించినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల. శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ కే.పీ. శోభన్ బాబు, కోశాధికారి నాని శ్రీనివాస్, అధికార ప్రతినిధులు సయ్యద్ జబీ ఉల్లా, కాంపెళ్లి శంకర్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గోవర్ధన్, గంగాధర్, దేవేందర్, కురుమూర్తి, సాయిలు, ప్రవీణ్, ఓ.ఎల్.ఎన్. రెడ్డి, వైకుంఠం, డాక్టర్ పడాల జగన్నాథం, కృష్ణారావు, మహిళ కార్యదర్శులు సంగీత, శైలజ, ఉదయ్ శ్రీ, రమాదేవి తదితరులు పేర్కొన్నారు