అధికంగా పరీక్ష ఫీజు వసూలు చేస్తే చర్యలు.!

రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులను ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలను తీవ్రంగా హెచ్చరించారు.

పరీక్ష ఫీజు వసూలు చేసే సమయంలో బోర్డు నిర్ణయించిన ఫీజులను వసూలు చేయాలని.. అధికంగా వసూలు చేసే కళాశాలల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో దాదాపు పరీక్ష ఫీజు కంటే రెట్టింపు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

source : ntnews