కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి

హన్మకొండ లో ఈ రోజు ఇంటర్ విద్య తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ ల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, మిగిలిన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.