ఇంటర్ విద్య టీ.జీ.వో సంఘ కేలెండర్ ఆవిష్కరించిన కడియం శ్రీహరి

  • ఇంటర్ విద్యా అబివృద్ది లో టీజీవో ల కృషి అమోఘం
  • 317 జి.ఓ. ఇబ్బందులను పరిష్కరించడానికి కృషి చేస్తా

హన్మకొండ : తెలంగాణ ఇంటర్ విద్య గెజిటెడ్ అధికారుల సంఘం కేలెండర్ ఆవిష్కరణ కడియం శ్రీహరి నివాసంలో జరిగింది. కేలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ లక్ష అడ్మిషన్ల చేరికతో ప్రభుత్వ ఇంటర్ విద్య దేశానికి నమూనాగా మారిందని… ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అధ్యాపకులు అధికారుల కృషితో ఈ ఘనత సాధించిందని… జ్ఞాన విప్లవ కాలంలో అధ్యాపకులు తమ ప్రతిభా నైపుణ్యాలను మెరుగుపర్చుకొని విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. ఈ వెలుగులో టిజిఓ ఇంటర్ విద్య చేస్తున్న కృషిని అభినందించారు.

ఉద్యోగ అవకాశాలలో ప్రాంతీయ అసమానతలు ఉండకూడదనే అనేది 317 జి.ఓ. స్పూర్తి అని, మల్టీజోన్ పోస్టుల్లో జరిగిన ఇబ్బందులను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్దీకరణ వేగవంతం చేసి మిగిలిన ఖాళీల నియామకం ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో టిజిఓ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ జగన్మోహన్ రావు, టిజిఓ ఇంటర్ విద్య రాష్ట్ర నేతలు అస్నాల శ్రీనివాస్, సుధీర్ కుమార్, జిల్లా అధ్యక్షుడు సింగారపు శ్రీధర్, కార్యదర్శి బాలునాయక్, సునీత, వాసవి, బాబు, సారంగపాణి, రాజేశ్వర్, హాలు నాయక్ లు పాల్గొన్నారు.