సీజేఎల్స్ కు నూతన జోనల్ ప్రకారం ఆప్షన్ అవకాశం కల్పించాలి – బదిలీ సాదన సమితి

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లను నూతన జోనల్ విధానం ప్రకారం విభజించడం వలన దాదాపుగా నలభై మందికి పైగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రబ్ కావడం జరిగిందని బదిలీ సాదన సమితి కన్వీనర్ నరసింహ రెడ్డి తెలిపారు.

ఈ డిస్ట్రబ్డ్ అయిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లతో పాటు మిగిలిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు కూడా నూతన జోనల్ విధానం ప్రకారం ఆప్షన్ అవకాశం కల్పించి సొంత స్థానికతకు బదిలీ చేయాలని బదిలీ సాదన సమితి తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ఆప్షన్ అవకాశం ఇవ్వకపోతే భవిష్యత్తులో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు స్థానికత కోల్పోయే అవకాశం ఉన్నందున కాంట్రాక్టు లెక్చరర్ల కూడా నూతన జోనల్ విధానం ప్రకారం ఆప్షన్ అవకాశమివ్వాలని బదిలీ సాధన సమితి తరపున కోరుకుంటున్నట్లు తెలిపారు.