డిస్ట్రబ్ అయినా సీజేఎల్స్ కు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి – కొప్పిశెట్టి

రాష్ట్రపతి ఉత్తర్వులు – 2018 ప్రకారం విడుదలైన జీవో నంబర్ 317 ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెగ్యూలర్ లెక్చరర్లు మల్టీ జోన్ – 1 మరియు 2 లలో కాంట్రాక్టు అధ్యాపకులను స్థానాలలోకి పోస్టింగ్ కావడంతో డిస్ట్రబ్ అయిన నేపథ్యంలో వారికి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ లు ఇవ్వాలని 475 సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, డా. కొప్పిశెట్టి సురేష్ లు ఇంటర్మీడియట్ విద్యా కమీషనర్ కు విన్నవించుకుంటున్నట్లు తెలిపారు.

ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి డిస్ట్రర్బ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లును రీ-అలాట్మెంట్ చేసే సందర్భంలో ప్రస్తుతం ఖాళీగా వున్న స్థానాలు అన్నింటిని చూపించి, వారివారి స్వంత జోన్లకు, జిల్లాలకు వెళ్ళే అవకాశం కల్పించగలరని…

అదేవిధంగా కాంట్రాక్టు లెక్చరర్ల విషయంలో స్పౌజ్/మెడికల్స్/ మ్యుచువల్ బదిలీలకై అవకాశం కల్పించగలరని… విన్నవిస్తున్నట్లు కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.