తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ వేడుకలు

మట్టి నుండి మాణిక్యాలను వెలికి తీసేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలని ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు.

తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలలో విద్యార్థులకు సృజనాత్మక ఆలోచనలతో సామాజిక బాధ్యతతో ఉంటారని అన్నారు. విద్యార్థుల జీవితాలలో అలసత్వం, సోమరితనం గుణాలకి చోటు ఉండకూడదని అన్నారు.

ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మేధో పటిమతో, వ్యక్తిగత శ్రద్ధతో విద్యార్థులని తీర్చిదిద్దటానికి అధ్యాపకులు కృషి చేస్తున్నారని అన్నారు.

విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం హోరెత్తింది. నృత్యాలు, నాటికలు, ఆటలు వంటి పలు ప్రదర్శనలతో అలరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాములు నాయక్, అశోక్, కిషన్, రాజ్ కుమార్, నాగరాజు, శ్వేత,శ్రీలత, బిక్షం, రాజు, యువజన నాయకులు నూశెట్టి రమేష్, సలెందర్, విద్యార్థులు పాల్గొన్నారు.