డీఐఈవో దృష్టికి సీజేఎల్స్ బదిలీ సమస్య

ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌటాల ను ఈ రోజు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీఐఈవో డా. శ్రీధర్ సుమన్ ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు గత 13 సవంత్సరాలుగా కళాశాలలో ఇతర జిల్లాల నుండి వచ్చి కుటుంబాలకు దూరంగా ఉండి బదిలీలు లేక ఇబ్బందులు పడుతున్నామని డీఐఈవో దృష్టికి తీసుకెళ్లారు.

డీఐఈవో డా. శ్రీధర్ సుమన్ కు వినతిపత్రం అందజేసిన వారిలో ఇంచార్జి ప్రిన్సిపాల్ బాలకిషన్ రావు, సంతోష్ కుమార్, రామారావు, రజిత, సమతా, రాంబాబు, రాజమల్లు, అశోక్, శ్రీనివాస్ నాయక్, తస్లీమున్నిసా బేగం, ఆంజినేయులు, రాజాం, రాము, మోతిలాల్ నాయక్ తదితరులు ఉన్నారు.