రీకౌంటింగ్/ రీవెరిఫికేషన్ ఉపసంహరణకు రేపటి నుంచి అవకాశం

అక్టోబర్ 2021 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు హజరై ఫెయిల్ అయిన మరియు వారి ఫెయిల్ సబ్జెక్టుల రీ-వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ (RVRC) కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ, తమ రీ-వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ కోసం చేసుకొన్న దరఖాస్తును రద్దు చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన లో తెలిపింది.

ఫెయిల్ సబ్జెక్ట్‌లలో RVRC అప్లికేషన్‌లను రద్దు చేయడానికి ఆప్షన్ 07-01-2022న సాయంత్రం 5:00 గంటల నుండి 17-01-2022 సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందని ప్రకటించారు.

తమ RVRC దరఖాస్తును రద్దు చేసుకున్న విద్యార్థులు పిబ్రవరి – 01 నుండి సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ నుండి దరఖాస్తు రుసుము మొత్తాన్ని పొందవచ్చని తెలిపారు.

వెబ్‌సైట్‌ :: https://tsbie.cgg.gov.in