ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు తేదీలు విడుదల

ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 కు సంబంధించిన పరీక్ష ఫీజులు చెల్లించుటకు తేదీలను ఇంటర్మీడియట్ కమిషనర్ విడుదల చేశారు.

జనవరి 5 నుండి జనవరి 24 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు.

అలాగే అక్టోబర్ లో ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి పాసైన విద్యార్థులు ఇంప్రూవ్ మెంట్ వ్రాయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

100 రూపాయల అపరాధ రుసుముతో జనవరి 31 వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 7 వరకు, 1000 రూపాయల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 14 వరకు, 2000 రూపాయల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం కలదు.