ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు జనవరి 8 నుంచి 16వ తేదీ వరకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటన జారీ చేశారు.

ఈ సెలవు దినాల్లో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ మరియు మేనేజ్మెంట్ లకు సూచించారు. తరగతులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాలలు తిరిగి జనవరి 17వ తేదీన ప్రారంభమవుతాయని తెలిపారు.